అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ స‌భ్యుల వాకౌట్‌!

క‌లం, వెబ్ డెస్క్‌: అసెంబ్లీ (Telangana Assembly) నుంచి బీఆర్ఎస్ స‌భ్యులు వాకౌట్ చేశారు. ప్ర‌భుత్వం తాము అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌రైన స‌మాధానం ఇవ్వ‌డం లేద‌ని బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు మండిప‌డుతున్నారు. రిటైర్డ్ ఉద్యోగుల పట్ల ఈ ప్రభుత్వం చూపిస్తున్న మోసపూరిత వైఖరికి నిరసనగా సభ నుండి వాకౌట్ చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు. రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వడంలో అలసత్వం వహిస్తున్నార‌ని, పీఆర్సీ, డీఏ విషయంలో సీపీఎస్ విషయంలో ఉద్యోగుల పట్ల మోసపూరిత వైఖరి అవ‌లంబిస్తున్నార‌ని బీఆర్ఎస్ స‌భ్యులు పేర్కొన్నారు.

బియ్యం ఎగుమ‌తుల‌పై మాజీ మంత్రి హ‌రీశ్ రావు (Harish Rao) ప్ర‌భుత్వంపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. బియ్యం స్కామ్‌పై హౌస్ క‌మిటీ వేయాల‌ని హ‌రీశ్ రావు డిమాండ్ చేశారు. ఆరోప‌ణ‌లు కొట్టివేసిన మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి హౌస్ క‌మిటీ ఏర్పాటుపై స్పందించ‌లేదు. అలాగే స‌న్న బియ్యం బోన‌స్ పెండింగ్ నిధులు ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు.

Read Also: కొరత లేదంటూనే.. కోతలు, వాతలు

Follow Us On: Instagram

 

 

 

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>