Mobile Popup Ad
Mobile Popup Ad

నారాయణపేటలో ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ ఆపొద్దు: హరిచందన

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: నారాయణ పేట (Narayanpet) జిల్లాలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంపై రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ శాఖ కార్యదర్శి దాసరి హరిచందన అధికారులకు అభినందనలు తెలిపారు. జిల్లా ప్రత్యేకాధికారిగా నియమితులైన ఆమె గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికపై కలెక్టర్ సీహెచ్.ప్రియాంకతో కలిసి సమీక్షించారు. భవిష్యత్తులో కూడా ఇదే ఒరవడిని కొనసాగించాలని సూచించారు. అందుబాటులో ఉన్న వనరులతోనే ప్రజలకు మేలు చేసేందుకు కృషి చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

నిరంతరం చేపట్టాలి..

అధికారులు రొటీన్ పనులపై కాకుండా అదే పనిని ఇతర ప్రాంతాల్లో ఎలా చేస్తున్నారో అధ్యయనం చేయాలని దాసరి హరిచందన సూచించారు. 99 రోజుల కార్యాచరణ అయిపోయిందని అనుకోకుండా సంవత్సరం పాటు అదే స్ఫూర్తితో ముందుగు సాగాలన్నారు. బడి బాట, ఫుడ్ సేఫ్టీ, అరైవ్ అలైవ్ కార్యక్రమాలను ప్రస్తావించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు చాలా జరుగుతుంటాయని, బ్లాక్ స్పాట్లను గుర్తించి వదిలేయకుండా, నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు. బాలికా విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎనీమియా సమస్యను అధిగమించాలన్నారు.

బాల్య వివాహాలు అరికట్టాలి..

నారాయణపేట (Narayanpet) జిల్లాలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతుంటాయని, నివారణకు తగిన చర్యలు చేపట్టాలని దాసరి హరిచందన ఆదేశించారు. వ్యవసాయ ఆధారిత జిల్లా కాబట్టి, సాధారణ పంటలతో పాటు పండ్లు, కూరగాయలు లాంటి ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులను చైతన్య పరచాలని సూచించారు. అటవీ విస్తీర్ణం కూడా తక్కువే అయినందున విరివిగా మొక్కలు నాటాలన్నారు.

జిల్లా కలెక్టర్ ప్రియాంక ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలను ప్రత్యేక అధికారిణి దాసరి హరిచందనకు వివరించారు. వివిధ శాఖల అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అంతకుముందు కలెక్టరేట్‌కు చేరుకున్న ప్రత్యేక అధికారిణి దాసరి హరిచందన‌కి జిల్లా రెవెన్యూ అధికారిణి రాజేశ్వరి, డీఎస్పీ లింగయ్య, ఇతర అధికారులు స్వాగతం పలికారు. జడ్పీ సీఈవో శ్రీనివాస్ రావు, డీఆర్డీఏ వెంకట్ రాములు, సీపీవో ఖాఘ వాహన్, డీడబ్ల్యూవో రాజేందర్ గౌడ్, హౌసింగ్ పీడీ శంకర్ నాయక్, హార్టికల్చర్ అధికారి సాయిబాబా, జిల్లా మత్స్య శాఖ అధికారి రెహమాన్, డీపీఆర్వో రషీద్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి అబ్దుల్ ఖలీల్ పాల్గొన్నారు.

Read Also: ఎల్ నినోను ఎదుర్కొందాం.. కరువును జయించే పంటలను పండిద్దాం!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>