దాడి ఘటనతో మనస్తాపం.. ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్య

కలం, కరీంనగర్ బ్యూరో: జగిత్యాల (Jagtial ) రూరల్ మండలం వెల్దుర్తి గ్రామానికి చెందిన బందెల రమేష్ (38) అనే ట్రాక్టర్ డ్రైవర్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. వెల్దుర్తి గ్రామానికి చెందిన బందెల రమేష్ గతంలో నర్సింగపూర్ గ్రామానికి చెందిన గడ్డం గంగారెడ్డి వద్ద డ్రైవర్‌గా పనిచేశాడు. తనకు రావాల్సిన కేవలం ఆరు వందల రూపాయల డబ్బులు ఇవ్వలేదనే కారణంతో రమేష్ వాట్సాప్ ద్వారా గడ్డం గంగారెడ్డిని దూషించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీంతో ఆగ్రహానికి గురైన గడ్డం గంగారెడ్డి మరో వ్యక్తితో కలిసి ఆదివారం ఉదయం రమేష్ ఇంటికి వచ్చి అతనిపై దాడి చేసినట్లు మృతుడి భార్య బందెల మల్లేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. అనంతరం రమేష్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించిన తర్వాత ఇంటికి తీసుకువచ్చినట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన రమేష్ ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి 4:30 గంటల మధ్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఫిర్యాదురాలు తెలిపినట్లు జగిత్యాల రూరల్ పోలీసులు పేర్కొన్నారు.

సమాచారం అందుకున్న జగిత్యాల రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దాడి ఘటనతో పాటు రమేష్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు జగిత్యాల రూరల్ పోలీసులు తెలిపారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>