కోల్‌కతాలో భారత షట్లర్లు కాదు.. స్క్వాష్ వీరుల జోరు!

కలం, స్పోర్ట్స్: హెచ్‌సీఎల్ స్క్వాష్ పీఎస్‌ఏ ఛాలెంజర్ టూర్ కోల్‌కతా (Kolkata) లెగ్‌లో భారత ఆటగాడు అరియంత్ కేఎస్ (Arihant KS) అదరగొట్టాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో స్విట్జర్లాండ్‌కు చెందిన లియాండ్రో మన్‌హార్ట్‌పై  11-6, 9-11, 13-11, 11-4తో విజయం సాధించి తదుపరి రౌండ్‌కు దూసుకెళ్లాడు. మ్యాచ్ ఆరంభంలోనే అరియంత్ దూకుడుగా ఆడాడు. తొలి గేమ్‌ను 11-6తో సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్‌లో ప్రత్యర్థి పుంజుకుని 11-9తో గెలిచినా.. కీలకమైన మూడో గేమ్‌లో అరియంత్ 13-11తో విజయం సాధించి మ్యాచ్‌పై పట్టు సాధించాడు. నాలుగో గేమ్‌లోనూ ఆధిపత్యం కొనసాగిస్తూ 11-4తో గేమ్‌ను గెలుచుకుని మ్యాచ్‌ను ముగించాడు.

మహిళల సింగిల్స్‌లో భారత ఆటగాళ్ల జోరు

మహిళల సింగిల్స్‌లో పూజా ఆర్తి రఘు పోరాడి విజయం సాధించింది. కాశ్వి మంగళ్‌పై 13-15, 11-6, 11-6, 7-11, 11-9తో గెలిచి తదుపరి రౌండ్‌కు చేరింది. అనన్య నారాయణన్ 8-11, 11-2, 11-8, 11-8తో అహానా సింగ్‌పై విజయం సాధించింది. వసుంధర నంగారే 11-8, 11-5, 11-5తో జానెట్ విధిని ఓడించింది. పురుషుల విభాగంలో రాహుల్ బైతా, సందేశ్ పలనివేల్ రవికుమార్ కూడా తొలి రౌండ్‌లో విజయాలు సాధించారు. మహిళల విభాగంలో రీవా నింబాల్కర్, అంజలి సెమ్వాల్, వ్యోమిక ఖండేల్వాల్, అనికా దూబే, సహనా కలైవాణన్ తదుపరి రౌండ్‌కు అర్హత సాధించారు.

కోల్‌కతాకు చేరిన ఛాలెంజర్ టూర్

హెచ్‌సీఎల్ స్క్వాష్ పీఎస్‌ఏ ఛాలెంజర్ టూర్ ఇండోర్, ముంబై, చెన్నై లెగ్‌ల తర్వాత ఇప్పుడు కోల్‌కతాకు చేరుకుంది. పురుషులు, మహిళల విభాగాల్లో చెరో 9 వేల డాలర్ల ప్రైజ్ మనీ ఉంది. పురుషుల విభాగంలో సూరజ్ కుమార్ చంద్ నాలుగో సీడ్, ఓం సెమ్వాల్ ఎనిమిదో సీడ్‌గా బరిలో ఉన్నారు. మహిళల విభాగంలో తన్వీ ఖన్నా టాప్ సీడ్‌గా కొనసాగుతోంది. కోల్‌కతా లెగ్‌లో భారత ఆటగాళ్లు మరింత మెరుగైన ప్రదర్శనతో ముందుకు సాగాలని అభిమానులు ఆశిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>