డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో మౌలిక వసతులు కల్పించాలి: కలెక్టర్ చాహత్

కలం, వరంగల్ బ్యూరో: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల సముదాయంలో తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ, తదితర మౌలిక వసతులను కల్పించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహుత్ బాజ్ పాయి (Collector Chahat Bajpai) అధికారులను ఆదేశించారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరు, కమలాపూర్‌లలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ల సముదాయాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆమె (Collector Chahat Bajpai) మాట్లాడుతూ.. రెండు పడక గదుల ఇళ్లకు సంబంధించి మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేయాలని, లబ్ధిదారులకు త్వరగా పంపిణీ చేసే విధంగా మౌలిక వసతులను కల్పించాలని అన్నారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గూడూరు, కమలాపూర్ సర్పంచ్‌లు వనజ, సతీష్, జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ సిద్ధార్థ నాయక్, డీఆర్డీఓ మేన శ్రీను, ఎంపీడీవో బాబు, తహశీల్దార్ సురేష్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read Also: ఘాజియాబాద్‌లో భారీగా కల్తీ పనీర్ పట్టివేత

Read Also: పెట్రో బాదుడు పాపం తలా పిడికెడు

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>