కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) చాలా రోజుల తర్వాత పూర్తిగా భిన్నమైన లుక్‌లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. సాధారణంగా వైట్ షర్ట్, బ్లాక్ సూట్‌లో స్టైలిష్ సీఎంగా కనిపించే విజయ్, తాజాగా సంప్రదాయ పంచెకట్టులో దర్శనమిచ్చారు. సినీ నిర్మాత జగదీశ్(Jagadish Palanisamy) గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరైన విజయ్ తెలుపు రంగు సంప్రదాయ దుస్తులలో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఆయన సింపుల్ అండ్ ట్రెడిషనల్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇటీవల కాలంలో మోడ్రన్ స్టైల్‌తో అభిమానులను ఆకట్టుకున్న విజయ్, ఇప్పుడు సంప్రదాయ వేషధారణలో కనిపించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమానికి హాజరైన పలువురు సినీ ప్రముఖులు విజయ్‌తో ఫోటోలు దిగగా, అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి.
Read Also: కోర్టు తీర్పుల్లో జాప్యానికి చెక్: సుప్రీంకోర్టు సంచలన మార్గదర్శకాలు
Follow Us On : WhatsApp

