కలం, వెబ్ డెస్క్ : అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) తన వ్యక్తిగత హక్కులు, గోప్యతను కాపాడాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును(Delhi High Court) ఆశ్రయించారు. తన పేరు, ఫోటోలు, వాయిస్‌ను అనుమతి లేకుండా వాడుతున్నారని పేర్కొంటూ ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన జస్టిస్ జ్యోతి సింగ్ ధర్మాసనం నాగచైతన్యకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సంబంధిత డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ ఆయన వ్యక్తిత్వ హక్కులకు రక్షణ కల్పించాలని ఆదేశించింది.
నాగచైతన్య తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది వైభవ్ గగ్గర్, కొన్ని అశ్లీల వెబ్‌సైట్‌లు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ఆయన పేరు, ఫోటోలు అనుమతి లేకుండా వాడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అలాగే నాగచైతన్య (Naga Chaitanya) పోలికలతో ఉన్న అనధికారిక వస్తువుల విక్రయం, ఏఐ ఆధారిత కంటెంట్, డీప్‌ఫేక్ వీడియోలు ఆన్‌లైన్‌లో విస్తృతంగా వినియోగిస్తున్నారని వివరించారు. ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించిన ఢిల్లీ హైకోర్టు.. నాగచైతన్య వ్యక్తిగత జీవితం, పరువుకు భంగం కలిగించేలా ఎలాంటి కంటెంట్ ప్రచారం చేయకూడదని స్పష్టం చేసింది. ఆయన అనుమతి లేకుండా పేరు, వాయిస్, ఫోటోలు ఉపయోగించకుండా తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Read Also: పిల్లలు జంక్‌ఫుడ్ తింటున్నారా..? మెదడులో జరిగే భయంకర మార్పులు ఇవే
Follow Us On : WhatsApp

