Mobile Popup Ad
Mobile Popup Ad

నన్ను అన్యాయంగా ఇరికించారు: అనంతబాబు

కలం, వెబ్ డెస్క్ : డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక సాక్షులను డబ్బులతో ప్రలోభపెడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు (Ananta Babu)కు కాకినాడ మొబైల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు ఆయన్ని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలిస్తున్న వేళ అనంతబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో తనను అన్యాయంగా ఇరికించారని వాపోయారు. తాను విచారణకు సహకరిస్తున్నా.. తనను వేధిస్తున్నారని ఆరోపించారు. తాను ఎవరినీ ప్రలోభాలకు గురి చేయలేదని చెప్పుకొచ్చారు.

మరోవైపు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అనంతబాబు విచారణకు సహకరించడం లేదని మొబైల్ కోర్టు విచారణలో పోలీసులు తెలిపారు. 30 ప్రశ్నలు అడిగితే కేవలం 5 ప్రశ్నలకే సమాధానం చెప్పారని పేర్కొన్నారు. సోమవారం కస్టడీ పిటిషన్ వేస్తామని పోలీసులు వెల్లడించారు.

Read Also: ఏపీలో నిప్పుల కొలిమిలా ఎండలు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>