గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీ

కలం, వెబ్ డెస్క్ : గుజరాత్ (Gujarat) – మహారాష్ట్ర హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బర్దోరిలిలో మహారాష్ట్ర ఆర్టీసీకి చెందిన రెండు బస్సులు ఒక ట్రాక్టర్ ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులు బోల్తా పడి మంటలు చెలరేగాయి. మరో బస్సు బోర్లాపడి నుజ్జునుజ్జయింది. ఘటనలో 8 మంది మరణించగా 30 మందికి పైగా గాయాలయ్యాయి.

ధూలే నుంచి నవాపూర్ మీదుగా సూరత్ కు వెళ్తున్న బస్సును ఎదురుగా వస్తున్న మరో బస్సును వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టింది. దీంతో ఒక బస్సు రోడ్డుపై బోల్తా పడి మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించాయి. బస్సులో నుంచి ప్రయాణికులు బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>