పార్ల‌మెంట్ స‌మావేశాల వేళ ‘రాహుల్ వీడియో’ క‌ల‌క‌లం!

క‌లం, వెబ్‌డెస్క్‌: పార్ల‌మెంట్ స‌మావేశాల వేళ లోక్‌స‌భ ప్ర‌తిప‌క్ష నేత‌ రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో క‌ల‌క‌లం రేపుతోంది. రాహుల్ గాంధీ ఫ్యామిలీ టైం ఎంజాయ్ చేస్తున్నారంటూ ముగ్గురు పిల్ల‌లు, మ‌రో మ‌హిళ‌తో ఉన్న ఓ వీడియోను నెటిజ‌న్లు తెగ వైర‌ల్ చేసేస్తున్నారు. ఈ వీడియోపై భిన్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అస‌లు ఈ వీడియో ఎప్పుడు, ఎక్క‌డ తీశారు? వీడియోలో ఉన్న‌వాళ్లు ఎవ‌రు? అన్న‌ది ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర లేపింది.

ఒక వైపు కాంగ్రెస్ పార్టీ పెద్ద‌లు పార్ల‌మెంట్‌లో వ్య‌వ‌హ‌రించాల్సిన వ్యూహాలు, కేంద్రం ప్ర‌వేశ పెట్ట‌నున్న కీల‌క‌ బిల్లుల‌పై పోరుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇలాంటి త‌రుణంలో పార్ల‌మెంట్ స‌మావేశాల ప్రారంభం రోజే రాహుల్ వీడియో వైర‌ల్ కావ‌డం హాట్ టాపిక్‌గా మారింది. రాహుల్ మద్దతుదారులు ఈ వీడియోలో త‌ప్పేముంద‌ని, లేనిపోని అవాస్త‌వాలు ప్ర‌చారం చేయ‌వ‌ద్ద‌ని ఆరోప‌ణ‌ల‌ను కొట్టిపారేస్తున్నారు. మరికొందరు మాత్రం ఈ వీడియో వెనుక ఉన్న అసలు నేపథ్యం ఏమిట‌ని ప్రశ్నలు గుప్పిస్తున్నారు.

మ‌రికొంత మంది ఈ వీడియోలో ఉన్నది రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన ఒక స్నేహితుడి కుటుంబానికి చెందిన వారని చెప్తున్నారు. ఇక‌పోతే రాహుల్ గాంధీకి ఇంకా పెళ్లి కాలేద‌న్న విషయం తెలిసిందే. ఆయనకు భార్యా, పిల్లలు ఉన్నట్లు ఎక్క‌డా అధికారిక సమాచారం లేదు. అయితే ఈ వీడియో వైర‌ల్ కావ‌డంతో రాహుల్ వ్య‌క్తిగ‌త జీవితంపై నెటిజ‌న్లు ప్ర‌శ్న‌లు గుప్పిస్తున్నారు. రాహుల్ ఏదైనా దాస్తున్నారా? అని అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>