కలం, వెబ్ డెస్క్: మహిళా ట్రైనీ ఐఏఎస్ ను లైంగికంగా వేధించారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి (Uday Krishna Reddy) ఆత్మహత్యాయత్నం చేశారు. ఆయనను హైదరాబాద్‌లోని SR నగర్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
తాను ఏ తప్పు చేయలేదు అంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. హైదరాబాద్ శివరాంపల్లిలోని జాతీయ పోలీస్ అకాడమీలో ఒక మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఇచ్చిన లైంగిక వేధింపుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారాలతో విచారణ పూర్తి చేశారు. ఆరోపణలు నిజమని నిర్ధారించిన ప్రివిలేజ్ కమిటీ అధికారులు.. ఎన్ పీఏ (NPA) నుంచి ఉదయ్ కృష్ణా రెడ్డిని తాత్కాలికంగా సస్పెండ్ చేశారు.

