కలం, వనపర్తి: వనపర్తి పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్ మిత్రులతో కలిసి అరుణాచలం (Arunachalam) యాత్రకు వెళ్లిన సందర్భంగా ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకున్నట్లు సమాచారం. అరుణాచలం సమీపంలోని తిరుచి (Tiruchi) వైపు వెళుతుండగా తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందినట్లు, మరో ఐదుగురికి తీవ్ర గాయాలైనట్లు ప్రాథమిక సమాచారం అందింది. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు, క్షతగాత్రుల పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అధికారుల నుంచి పూర్తి సమాచారం వెలువడిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

