ఢిల్లీలో గాలి కాలుష్యం(Air Pollution) మళ్ళీ పీక్స్‌కు చేరుకుటుంది. సీజన్ స్టార్టింగ్లో అలెర్ట్ ప్రకటించే స్థాయికి ఢిల్లీ గాలి నాణ్యత పడిపోయింది. దీంతో గాలి కాలుష్యంతో పోరాడటం కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తసీుకుంది. ఇందులో భాగంగానే కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీమేనేజ్‌మెంట్(CAQM) రాష్ట్రంలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(GRAP) స్టేజ్3 నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది. ఢిల్లీ నగరంలో గాలి నాణ్యత 425కి చేరడంతో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డాటా ప్రకారం.. ఆనంద్ విహార్ 412, అలిపుర్ 442, బావ ప్రాంతంలో అత్యధికంగా 462గా ఏక్యూఐ నమోదయింది. జనవరి 1 నుంచి నవంబర్ 9 మధ్య ఢిల్లీలో సగటు ఏక్యూఐ 175గా రికార్డ్ అయింది. గతేడాది ఇదే సమయంలో గాలి నాణ్యత 189గా నమోదయిందని వాతావరణ శాఖ తెలిపింది.
GRAP-3 నిబంధనలు
రెడీ-మిక్స్ కాంక్రీట్ (RMC) ప్లాంట్ల మట్టి పని, పైలింగ్, ట్రెంచింగ్, ఓపెన్-ఎయిర్ ఆపరేషన్లు వంటి అనవసరమైన నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలు పూర్తి నిషేధం.
ఢిల్లీ, పొరుగున ఉన్న NCR జిల్లాల్లో BS-3 పెట్రోల్, BS-4 డీజిల్ ఫోర్-వీలర్ల రాకపోకలు నిషేధం.
ముఖ్యంగా చదును చేయని రోడ్లపై ఇసుక, సిమెంట్ వంటి నిర్మాణ సామగ్రి రవాణాపై నిషేధం.
స్వచ్ఛమైన ఇంధనంతో పనిచేయని రాతి క్రషర్లు, మైనింగ్, హాట్-మిక్స్ ప్లాంట్ల మూసివేత.
అత్యవసర, అవసరమైన సేవలు మినహా డీజిల్ జనరేటర్ సెట్లపై నిషేధం.
ఢిల్లీలోకి ప్రవేశించే లేదా నడిచే అంతర్-రాష్ట్ర డీజిల్ బస్సులపై పరిమితులు ఉంటాయి.
వాహన ఉద్గారాలను అరికట్టడానికి ప్రైవేట్ కంపెనీలు వర్క్-ఫ్రమ్-హోమ్ లేదా హైబ్రిడ్ మోడ్‌ను అమలు చేయాలని సూచన.
విషపూరిత గాలి(Air Pollution) నుండి చిన్న పిల్లలను రక్షించడానికి తరగతులు ఆన్‌లైన్ మోడ్‌కు మార్చాలని, అందులో భాగంగా 5వ తరగతి వరకు పాఠశాలల మూసివేయాలి.
GRAP-3 వీటికి మినహాయింపు
రైల్వేలు, మెట్రో నిర్మాణం, విమానాశ్రయాలు, రక్షణ, పారిశుధ్యం, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు వంటి ముఖ్యమైన ప్రజా ప్రాజెక్టులు కఠినమైన దుమ్ము, వ్యర్థాల నిర్వహణ నిబంధనల ప్రకారం కొనసాగడానికి అనుమతించబడతాయి.
Read Also: ఢిల్లీ ఘటనపై మోడీ స్పందన ఇదే..
Follow Us on : Pinterest

