ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో సంభవించిన పేలు ప్రభావం దేశమంతా ఉంది. ఇందులో ఉగ్ర హస్తం ఉండటంతో దేశమంతా అలెర్ట్ అయింది. ఇందులో భాగంగా జమ్మూకశ్మీర్(Jammu Kashmir)లో వాహనాల తనిఖీలను చేపట్టారు. అక్కడ సాధారణంగా ప్రతిరోజూ చెకింగ్ జరుగూనే ఉంటున్నప్పటికీ. ఢిల్లీ ఘటన తనిఖీలను ముమ్మరం చేశారు అధికారులు జమ్మూ-శ్రీనగర్ హైవేపై నవ్‌యుగ్ టన్నల్ దగ్గర ఉగ్రవాద సంబంధిత శక్తులను ట్రాక్ చేయడం కోసం తనిఖీలు చేస్తున్నట్లు కుల్గమ్ ఎస్ఎస్‌పీ ఎల్ చౌదరి తెలిపారు.
Jammu Kashmir | ‘‘ఈ ప్రాంతంలో దేశ వ్యతిరేక శక్తులను గుర్తించడం కోసం తనిఖీలు చేస్తున్నాం. అందులో భాగంగానే కుల్గమ్ జిల్లాలో కూడా విస్తృతంగా సోదాలు చేస్తున్నాం. అనుమానాస్పదంగా కనిపించిన ప్రతి వాహనాన్ని సోదా చేస్తున్నాం. నవ్‌యుగ్ టన్నెల్ దగ్గర ప్రతి ఒక్క వాహానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేరస్తున్నాం. సోమవారం రాత్రి ఇక్కడ.. నేపాల్‌కు చెందిన ఒక వ్యక్తి కొన్ని నిషేధిత వస్తువులను తరలిస్తుండా పట్టుకున్నాం’’ అని ఆయన వెల్లడించారు.
Read Also: ఢిల్లీలో GRAP-3 నిబంధనలు.. ఇదే తొలిసారి
Follow Us on: Instagram

