ప్రపంచ దిక్సూచిగా తెలంగాణ : గవర్నర్​ శివ ప్రతాప్ శుక్లా

కలం, వెబ్​ డెస్క్​ : ప్రపంచ దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తుంది అని గవర్నర్​ శివ ప్రతాప్ శుక్లా ధీమా వ్యక్తం చేశారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర గీతం, అనంతరం వందేమాతరం, ఆ తర్వాత జనగణమన జాతీయ గీతంతో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాలు (Telangana Assembly) ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా గవర్నర్​ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. సుదీర్ఘ చారిత్రాత్మక పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. త్యాగాలు, విశ్వాసాలను గౌరవిస్తూ ప్రజాపాలన స్ఫూర్తి ద్వారా మార్గదర్శకంగా ఉందని కొనియాడారు. ప్రతీ ఒక్కరికీ ఫలాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదన్నారు. 2047 తెలంగాణ రైజింగ్ దిశగా అడుగులు వేస్తుస్తున్నామని స్పష్టం చేశారు.

గత సంవత్సర కాలంలో సాహసోపేతమైన సంస్కరణలు, సంక్షేమ పథకాలను అందరికీ అందేలా పునాదులు వేసినట్లు గుర్తుచేశారు. అందరికీ గౌరవ ప్రదమైన అభివృద్ధి దిశగా నడిపించే రోడ్ మ్యాప్‌ను అందిస్తున్నట్లు తెలిపారు. 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం మూడు ట్రిలియన్ డాలర్లకు, 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లకు చేరుకునే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్నదని వెల్లడించారు. తెలంగాణ పురోభివృద్ధిలో ప్రతీ ఒక్కరు భాగస్వాములేనని.. తెలంగాణ ప్రజలు శ్రమించే తత్వం ఉన్నవారన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పరిపాలన సాగుతున్నదని గవర్నర్​ శివప్రతాప్​ శుక్లా తెలిపారు.

Read Also: ఫస్ట్ టైమ్ హిందీలో స్పీచ్.. గవర్నర్ కొత్త ట్రెండ్

Follow Us On : WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>