ఫస్ట్ టైమ్ హిందీలో స్పీచ్.. గవర్నర్ కొత్త ట్రెండ్

కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్రం ఏర్పడిన తర్వాత బడ్జెట్ సెషన్‌లో (Budget Session) మొట్టమొదటి సారి గవర్నర్ ప్రసంగం హిందీలో సాగింది. ఇప్పటివరకు గవర్నర్‌లుగా వ్యవహరించిన ఈఎస్ఎల్ నర్సింహన్, తమిళిసై సౌందర్‌రాజన్, జిష్ణుదేవ్ వర్మ తదితరులంతా ఇంగ్లీషులోనే ప్రసంగించారు. కానీ ఇటీవలే గవర్నర్‌గా వచ్చిన శివప్రతాప్ శుక్లా (Shiv Pratap Shukla) మాత్రం తెలుగులో ప్రారంభించి తెలుగులోనే ప్రసంగాన్ని ముగించారు. మధ్యలో స్పీచ్ అంతా హిందీలోనే ఇచ్చారు. ఇంగ్లీష్ భాషపై పట్టు ఉన్నా ఆయన హిందీలోనే ప్రసంగించడం గమనార్హం. గోరఖ్‌పూర్ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పట్టా తీసుకున్న ఆయన ఇంగ్లీషులో ప్రసంగించడానికి ఇబ్బందులు లేకపోయినా హిందీలో మాట్లాడాలని తీసుకున్న నిర్ణయం చర్చకు దారితీసింది. దేశంలో ఒకవైపు హిందీ భాషపై రకరకాల చర్చలు జరుగుతున్న తరుణంలో గవర్నర్ హిందీలో ప్రసంగించడానికి కారణాలపై గుసగుసలు మొదలయ్యాయి.

తమిళనాట హిందీ వ్యతిరేక పోరాటం :

కాంగ్రెస్‌తో పొలిటికల్ పొత్తులో ఉన్న డీఎంకే (DMK) దీర్ఘకాలంగానే హిందీ వ్యతిరేక పోరాటాన్ని కొనసాగిస్తున్నది. జాతీయ భాష పేరుతో తమిళనాడుపై బలవంతంగా రుద్దితే సహించేది లేదంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ బహిరంగంగానే పలుమార్లు కామెంట్ చేశారు. వారం రోజుల క్రితం సైతం నేమ్ బోర్డుల్లో ఉన్న హిందీ అక్షరాలను తుడిపేసి పోరాటాన్ని కంటిన్యూ చేశారు. కాంగ్రెస్‌తో పొత్తులో ఉన్న తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం ఈ స్థాయిలో ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్న తెలంగాణలో భిన్నమైన వైఖరి మర్మమేంటనే మాటలు వినిపిస్తున్నాయి. గవర్నర్ (Shiv Pratap Shukla) హిందీ స్పీచ్ ఇవ్వడం రానున్న రోజుల్లో బీజేపీ పెత్తనం పెరుగుతుందనడానికి సంకేతమేననే సందేహాలూ వ్యక్తమయ్యాయి.

Read Also: మెరుగైన సేవ‌ల కోస‌మే జీహెచ్ఎంసీ విభ‌జ‌న: గ‌వ‌ర్న‌ర్ శుక్లా

Follow Us On: X(Twitter)

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>