Mobile Popup Ad
Mobile Popup Ad

కాంగ్రెస్‌లో చేరిక‌పై మాజీ మంత్రి మల్లారెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు

క‌లం, వెబ్ డెస్క్‌: మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి (Mallareddy) కాంగ్రెస్ పార్టీలో చేర‌బోతున్నార‌ని కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. దీనిపై మ‌ల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు. నేడు మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన మ‌ల్లారెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాను కాంగ్రెస్ (Congress) పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల‌ను ఖండిస్తూ త‌న‌ వయసు 73 ఏళ్లు అని, ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో త‌న‌కు బాగా తెలుసున‌ని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పార్టీ ఒక మునిగిపోయే పడవ అని, ఎవరైనా ముగినే ప‌డ‌వ‌లో ఎక్కుతారా అని కామెంట్ చేశారు. 11 ఏళ్లు.. కాదు 50 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంద‌ని ఎద్దేవా చేశారు. గ్రౌండ్ లెవెల్‌లో ఎవరు బలంగా ఉన్నారో ప్ర‌జ‌లంద‌రికీ తెలుస‌న్నారు. మొన్ననే సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)ని కలిసి త‌న పెళ్లి రోజు వేడుకలకు ఆహ్వానించిన‌ట్లు చెప్పారు. మొత్తానికి సోష‌ల్ మీడియాలో కొద్ది రోజులుగా న‌డుస్తున్న పార్టీ మార్పు ప్ర‌చారానికి త‌న వ్యాఖ్య‌ల‌తో మ‌ల్లారెడ్డి చెక్ పెట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>