కలం, వెబ్ డెస్క్: అసెంబ్లీలోని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) ఛాంబర్ ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అవమానం జరిగింది. భట్టి ఛాంబర్‌లోకి వెళ్ళేందుకు ఎమ్మెల్యేలు మందుల సామెలు, కవ్వంపల్లి సత్యనారాయణ, విజయ రమణరావు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే వారిని లోపలికి పంపకుండా డిప్యూటీ సీఎం గన్ మెన్లు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలమైన మమ్మల్నే ఛాంబర్ లోకి పంపించడం లేదని వారు ఆగ్రహించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఛాంబర్ ముందు కూడా ఇలా తమను ఆపరు అంటూ ఎమ్మెల్యేలు అక్కడినుంచి అసంతృప్తితో వెళ్ళిపోయారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
అటు కాసేపటిక్రితమే అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా(Shiv Pratap Shukla) ఆవిష్కరించారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయన వెంట ఉన్నారు. అనంతరం గవర్నర్, సీఎం, మంత్రులు కలిసి అసెంబ్లీ ఆవరణలోని మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు సమర్పించారు. విగ్రహావిష్కరణ అనంతరం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్నారు. ప్రసంగం ముగిసిన తర్వాత సభ మంగళవారానికి వాయిదా పడనుంది.
Read Also: కుప్పకూలుతున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
Follow Us On: Facebook

