కలం డెస్క్: అమెరికా వీసా పొందడం చాలా పెద్ద అడ్వేంచర్‌లా మారుతోంది. అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్‌మెంట్‌లు భారీగా ఆలస్యం కావడమే ఇందుకు కారణం. ఈ వీసాలు భారీగా లేట్ అవుతన్న నేపథ్యంలో ఆల్ఫాబెట్ సంస్థ గూగుల్ (Google) తమ ఉద్యోగులకు కీలక హెచ్చరిక చేసింది. అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగులు విదేశీ ప్రయాణాలు చేయవద్దని గూగుల్ హెచ్చరించింది.
గూగుల్‌కు బాహ్య ఇమ్మిగ్రేషన్ సలహాదారులైన బీఏఎల్(BAL) ఇమ్మిగ్రేషన్ లా సంస్థ అంతర్గత ఇమెయిల్ ద్వారా ఈ సూచన పంపినట్లు సమాచారం. అమెరికాకు తిరిగి రావడానికి వీసా స్టాంప్ అవసరమైన ఉద్యోగులు దేశం విడిచి వెళ్లితే, తిరిగి రావడంలో తీవ్రమైన ఆలస్యాలు ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశముందని హెచ్చరించారు.
కొన్ని అమెరికా ఎంబసీలు (Embassy ), కాన్సులేట్లలో వీసా అపాయింట్‌మెంట్లకు 12 నెలల వరకు ఆలస్యం జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఈ హెచ్చరిక, H-1B వీసాలపై ట్రంప్ పరిపాలన కఠిన వెట్టింగ్, అధిక ఫీజులు విధించిన నేపథ్యంలో విడుదలైంది. ఇదివరకు కూడా, గూగుల్ (Google) తన H-1B ఉద్యోగులకు విదేశీ ప్రయాణాలను పరిమితం చేయాలని సూచించింది. గత సెప్టెంబర్‌లో వీసా ప్రాసెసింగ్, ఇమ్మిగ్రేషన్ విధానాలపై పెరుగుతున్న అనిశ్చితి నేపథ్యంలో, H-1B వీసాలపై ఉన్న ఉద్యోగులు అమెరికాలోనే ఉండాలని, అంతర్జాతీయ ప్రయాణాలను పరిమితం చేయాలని సంస్థ సూచించింది.
Read Also: గ్యారేజ్ నుండి గ్లోబల్ దిగ్గజం వరకు.. గూగుల్ విజయగాథ
Follow Us On: Youtube


