కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర అసెంబ్లీ, శాసన మండలికి (Telangana Assembly) వేర్వేరుగా కార్యదర్శులను నియమిస్తూ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. ప్రస్తుతం శాసన సభ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వీ. నరసింహాచార్యులు శాసన మండలి కార్యదర్శిగా నియమితులవ్వగా.. శాసన సభ కార్యదర్శిగా ఆర్. తిరుపతి ని నియమిస్తూ రాష్ట్ర సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వక్ఫ్ ట్రిబ్యునల్ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న ఆర్. తిరుపతి శాసన సభ కార్యదర్శిగా సేవలందిస్తారని ప్రభుత్వం వెల్లడించింది.
Read Also: వీసాల ఆలస్యం.. ఉద్యోగులకు గూగుల్ హెచ్చరిక
Follow Us On: Pinterest


