కలం, వెబ్ డెస్క్: బంగారం, వెండి ధరలు (Gold Silver Prices) మరోసారి ఆకాశాన్ని అంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఆల్ టైం రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల యూరప్‌లోని ఎనిమిది దేశాలపై సుంకాలు విధించనున్నట్లు చేసిన ప్రకటన, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ధరలు భారీగా పెరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం గోల్డ్ ధర 1.7 శాతం పెరిగి ఔన్స్‌కు 4,676.22 డాలర్లకు చేరింది. వెండి ధర 3.9 శాతం పెరిగి ఔన్స్‌కు 93.6305 డాలర్లకు చేరగా, ఒక దశలో 94.1213 డాలర్ల రికార్డు స్థాయిని నమోదు చేసింది.
హైదరాబాద్‌లో ధరలు ఇలా..
ఇక హైదరాబాద్‌లోనూ ఇదే స్థాయిలో బంగారం ధరలు (Gold Silver Prices) పెరిగాయి. సోమవారం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 1910 రూపాయలు పెరిగి.. 1, 45, 690 చేరుకున్నది. ఆదివారం తులం బంగారం 1,43, 780 రూపాయలు ఉన్నది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 1750 పెరిగి 1,31,800 కే చేరుకున్నది. వెండి ధరలు కూడా అదే స్థాయిలో పరుగులు పెడుతున్నాయి. సోమవారం కిలో వెండి ధర 8,000 పెరిగి 3,18,000లకు చేరుకున్నది.


