కలం, మెదక్ బ్యూరో: సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్(SISF)కు సంగారెడ్డి జిల్లా (Sangareddy) వేదికైంది. సౌత్ ఇండియా విద్యార్థుల టాలెంట్‌ను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ సైన్స్ ఫెయిర్ జరుగుతోంది. జిల్లాలోని రామచంద్రపురం మండలం కొల్లూరులోని గాడియం ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో సోమవారం సైన్స్ ఫెయిర్ (Science Fair) జరుగుతోంది. దాదాపు 210 నూతన ఆవిష్కరణలు విద్యార్థులు ప్రదర్శిస్తున్నారు.
బాల శాస్త్రవేత్తలు తమ ప్రతిభను చాటిచెప్పేలా సైన్స్ స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సందర్శకులకు ప్రవేశం కల్పించనున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య వెల్లడించారు. ఈ నెల 23 వరకు కొనసాగే ఈ సైన్స్ ఫెయిర్‌లో విద్యార్థులు అనేక ఆవిష్కరణలు ప్రదర్శించనున్నారు.


