Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణ సాధనలో BJP పాత్రను ఎవరూ విస్మరించలేరు: రామ్‌చందర్ రావు

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ నిబద్ధత, చిత్తశుద్ధి, రాజకీయ సంకల్పం కీలక పాత్ర పోషించాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామ్‌చందర్ రావు (Ramchander Rao) అన్నారు. తెలంగాణ ఇచ్చామని చెప్పుకునేవారు చాలామంది ఉన్నారు కానీ, తెలంగాణ బిల్లు పాస్ కావడంలో బీజేపీ పాత్రను ఎవరూ మర్చిపోలేరని వ్యాఖ్యానించారు. తెలంగాణ బిల్లు పాస్ కావడానికి బీజేపీ పూర్తి స్థాయిలో సహకరించిందని.. ఇది చరిత్రలో నమోదైన సత్యం అని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో బీజేపీ పాత్రను ఎవరూ విస్మరించలేరని.. అది చరిత్రలో నమోదైన వాస్తవమని పేర్కొన్నారు. సమర్థవంతమైన పరిపాలనకు చిన్న రాష్ట్రాలే మార్గమని కమలం పార్టీ మొదటి నుంచే నమ్మిందని.. తెలంగాణకు అదే ఆలోచనతో మద్దతిచ్చామని పేర్కొన్నారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అవలంబించిందని.. బీజేపీ మాత్రం ఎప్పుడూ మాట మార్చలేదని అన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ బిల్లుకు బీజేపీ ఎలాంటి షరతులు లేకుండా బేషరతుగా మద్దతు ఇచ్చిందన్నారు.

పెప్పర్ స్ప్రే ఘటనతో పార్లమెంట్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా… తెలంగాణ బిల్లుపై బీజేపీ మద్దతు వెనక్కి తీసుకోలేదని రామ్‌చందర్ రావు అన్నారు. తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన కీలక సమయంలో అప్పటి టీఆర్ఎస్ ఎంపీలు సభలో లేరని చెప్పారు. తెలంగాణ బిల్లు ఆమోదం వెనుక బీజేపీ జాతీయ నాయకత్వం పూర్తి రాజకీయ సంకల్పం ఉందన్నారు. తెలంగాణ బిల్లు కాపీతో తాను స్వయంగా ఢిల్లీలో అరుణ్ జైట్లీ ని, బీజేపీ అగ్రనేతలను కలిసి వివరించానని చెప్పారు. సీనియర్ న్యాయవాదులు ప్రకాశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డితో కలిసి అరుణ్ జైట్లీని కలిశానని అన్నారు. బిల్లుపై అభ్యంతరాలు చెప్పొద్దని.. ముందుగా తెలంగాణ రాష్ట్రం రావాలని అరుణ్ జైట్లీ సూచించారని గుర్తు చేశారు. తెలంగాణ బిల్లుకు సంబంధించిన ప్రక్రియలో తాను ప్రత్యక్షంగా భాగస్వామిని అయ్యానని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెరవెనుక ఎంతో కీలకంగా పనిచేశామన్నారు. సుష్మా స్వరాజ్ తెలంగాణ ఆకాంక్షలకు బహిరంగంగా అండగా నిలిచి సంపూర్ణ మద్దతు ప్రకటించారని గుర్తు చేశారు. తెలంగాణ కోసం విమర్శలు, రాజకీయ దాడులు ఎదురైనా BJP నాయకత్వం వెనక్కి తగ్గలేదని వ్యాఖ్యానించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>