Mobile Popup Ad
Mobile Popup Ad

పవన్ కల్యాణ్ సభకు ఎందుకు అనుమతి ఇవ్వలేదు: రామ్‌చందర్ రావు

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సభకు ఎందుకు అనుమతి ఇవ్వలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామ్‌చందర్ రావు (Ramchander Rao) ప్రశ్నించారు. తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టాలని బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ సభ పెడతానంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను వ్యతిరేకించిన సీపీఎంతో కాంగ్రెస్ పార్టీ ఎలా పొత్తు పెట్టుకుంటుందని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదని అన్నారు. రాజకీయ పరిస్థితిని బట్టి తెలంగాణలో పొత్తులపై ముందుకు వెళతామని తెలిపారు. జనసేన పార్టీతో పొత్తుపై బీజేపీ హై కమాండ్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పుకొచ్చారు. ప‌వ‌న్ కల్యాణ్ స‌భ‌కు ప‌ర్మిష‌న్ ఇచ్చింటే స‌రిపోయేది క‌దా.. కానీ, ఆ ఇష్యూను బీజేపీకి ఎందుకు రుద్దుతున్నారు? అని ప్రశ్నించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>