Mobile Popup Ad
Mobile Popup Ad

ప‌వ‌న్ ఖేరాకు గౌహ‌తి హైకోర్ట్‌లో చుక్కెదురు!

క‌లం వెబ్ డెస్క్: అస్సాం సీఎం హిమంత బిశ్వ శ‌ర్మ భార్య‌పై చేసిన ఆరోప‌ణ‌ల‌కు సంబంధించి కాంగ్రెస్ నేత ప‌వ‌న్ ఖేరా (Pawan Khera )కు గౌహ‌తి హైకోర్ట్ (Gauhati High Court) షాకిచ్చింది. ఆయ‌న ముంద‌స్తు బెయిల్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న పిటిష‌న్‌ను విచారించి , దానిని తిర‌స్క‌రిస్తూ శుక్ర‌వారం తీర్పు వెల్ల‌డించింది. హిమంత భార్య‌ రినికి భుయాన్ శర్మకు మూడు దేశాల పాస్‌పోర్టులు ఉన్నాయని, దుబాయ్‌లో అక్రమ ఆస్తులు ఉన్నాయని ఎన్నికల ప్రచారంలో ప‌వ‌న్‌ ఖేరా ఆరోపించారు. ఈ వ్యాఖ్య‌ల‌పై రినికి భుయాన్ క్రిమినల్ కేసు దాఖలు చేశారు. దీంతో ప‌వ‌న్ ముంద‌స్తు బెయిల్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోగా కోర్ట్ స‌ద‌రు బెయిల్ పిటిషన్‌ను తిర‌స్క‌రించింది.

గ‌తంలో ఈ వ్య‌వ‌హారంలో తెలంగాణ హైకోర్టు నుంచి ప‌వ‌న్ ఖేరా ట్రాన్సిట్ బెయిల్ పొందారు. దీన్ని నిలిపివేస్తూ, సంబంధిత కోర్ట్‌ను ఆశ్ర‌యించాల‌ని సుప్రీంకోర్టు సూచించింది. గౌహతి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఖేరాపై మోసం, పరువు నష్టం, ఫోర్జరీ వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో ఈ కేసులో ప‌వ‌న్ ఖేరా (Pawan Khera) త్వ‌ర‌లో అరెస్ట్ కావ‌డం ఖాయ‌మంటూ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది.

Read Also: చదరంగంలో ఆరవ్ సంచలనం.. 12 ఏళ్లకే ఫైడ్ మాస్టర్‌గా రికార్డు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>