Mobile Popup Ad
Mobile Popup Ad

అల్యూమినియం టెస్ట్‌తో మీ ఇల్లు సేఫ్‌..!

క‌లం వెబ్ డెస్క్: ఇల్లు (Home) అంటే ఒక ఎమోషన్. ఎన్నో కలలతో దానిని నిర్మించుకుంటాం, కొనుక్కుంటాం. మన కలల సౌధం ఇంటిని నీరు నీరుగార్చేస్తుంటే ఏం చేయాలి మరి..? మ‌న‌ ఇంటి గోడలను తేమ తినేస్తుందని ముందుగానే గుర్తిస్తే సమస్యను తగ్గించుకోవచ్చు. ఇంటి గోడలపై పెయింట్ ఊడిపోవడమో లేదా తడి మచ్చలు కనిపించడమో జరిగితే.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని అర్థం. అయితే, వేల రూపాయలు ఖర్చు పెట్టి రిపేర్లు చేయించే ముందు, అసలు సమస్య ఎక్కడుందో తెలుసుకోవడం ముఖ్యం. దీనికోసం అమెరికాకు చెందిన ‘దిస్ ఓల్డ్ హౌస్’ మ్యాగజైన్ ఒక అద్భుతమైన మార్గాన్ని సూచించింది. కేవలం ఒక అల్యూమినియం ఫాయిల్ ముక్కతో మీ ఇంటి గోడల సమస్యను రెండే నిమిషాల్లో కనిపెట్టవచ్చు.

ఇళ్లలో తేమ అనేది రెండు రకాలుగా వస్తుంది. ఒకటి గదిలో మనం చేసే పనుల వల్ల (వంట, స్నానం, బట్టలు ఆరబెట్టడం) వచ్చే గాలిలోని తేమ. రెండోది, గోడ లోపలి పగుళ్లు లేదా బయటి డ్రైనేజీ సమస్యల వల్ల వచ్చే నీరు. అమెరికాలోని దాదాపు 60 శాతం ఇళ్లలో బేస్‌మెంట్ ద్వారా నీరు రావడం పెద్ద సమస్యగా మారుతోంది. అందుకే ఈ ‘ఫాయిల్ టెస్ట్’ ద్వారా అది చిన్న వెంటిలేషన్ సమస్యా లేక పెద్ద స్ట్రక్చరల్ సమస్యా అనేది తేలిపోతుంది.

ఎలా పరీక్షించాలి..

ముందుగా గోడపై ఉన్న తడిని, దుమ్మును శుభ్రమైన గుడ్డతో తుడవాలి. ఆ తర్వాత అక్కడ ఒక అల్యూమినియం ఫాయిల్ ముక్కను తీసుకుని గోడకు అంటించాలి. గాలి చొరబడకుండా నాలుగు వైపులా టేపుతో గట్టిగా సీల్ చేయాలి. దీనిని 24 నుండి 48 గంటల పాటు అలాగే వదిలేయాలి.

రిజల్ట్స్ ఎలా ఉంటాయంటే..
లోపలి వైపు తడి ఉంటే:

ఫాయిల్ తీసినప్పుడు గోడకు తగిలే వైపు (లోపల) నీటి చుక్కలు ఉంటే, సమస్య గోడ లోపల ఉందని అర్థం. పునాదుల పగుళ్లు లేదా బయట నీరు నిలబడటం వల్ల ఇలా జరుగుతుంది.

బయటి వైపు తడి ఉంటే:

ఫాయిల్ పైన (గది వైపు) తడి ఉంటే, అది గాలిలోని తేమ వల్ల వస్తోందని గుర్తించాలి. దీనికోసం కిటికీలు తెరవడం, ఎగ్జాస్ట్ ఫ్యాన్లు వాడటం ద్వారా గాలి ఆడేలా చూస్తే సరిపోతుంది.

పరిష్కారాలు:

సీపేజ్ సమస్య ఉంటే ఇంటి బయట నీరు నిలబడకుండా చూసుకోవాలి. అవసరమైతే బ్లీచింగ్ సొల్యూషన్‌తో క్లీన్ చేసి, సిమెంట్ ఆధారిత పెయింట్లు వేయాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>