Mobile Popup Ad
Mobile Popup Ad

అభివృద్ధి పనులకు గంగుల కమలాకర్ శంకుస్థాపన

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీపురం కాలనీ ఆంజనేయ స్వామి, శివాలయ ప్రాంతంలో గత ప్రభుత్వం హయంలో మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ రావు సహాకారంతో ఎంపీ నిధుల నుండి రూ.10 లక్షల నిధులను కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కేటాయించారు. దీనికి సంబంధించిన పనులను ఆదివారం రోజున మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో కలిసి మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Gangula Kamalakar) భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.

కమ్యూనిటీ హాల్ భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ మంత్రులకు కాలనీ వాసులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. కార్యక్రమం అనంతరం అతిథులను కాలనీవాసులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, స్థానిక డివిజన్ కార్పొరేటర్ గాదే రూప- శ్రీనివాస్, కాలనీ అధ్యక్షులు కన్న రాజమౌళి, ప్రధాన కార్యదర్శి చావ నాగేశ్వరరావు, ముఖ్య సలహాదారు చిందం శ్రీనివాస్, బల్మూరి రామచంద్రరావు, కోల అన్నారెడ్డి, పలువురు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Read Also: ఆయిల్‌పామ్‌తో అధిక లాభాలు : పొన్నం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>