Mobile Popup Ad
Mobile Popup Ad

LSG vs GT మ్యాచ్.. విజయం ఎవరిని వరిస్తుందో?

కలం, స్పోర్ట్స్​ : ఐపీఎల్ 2026 సీజన్ 19వ మ్యాచ్‌లో నేడు లక్నో సూపర్ జాయింట్స్, గుజరాత్ టైటాన్స్ (LSG vs GT) జట్లు తలపడనున్నాయి. లక్నోలోని భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సీజన్ ఆరంభంలో లక్నో కాస్త తడబడినప్పటికీ, గత రెండు మ్యాచ్‌ల్లో చివరి బంతి వరకు పోరాడి అద్భుత విజయాలను అందుకుంది. ముఖ్యంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ముకుల్ చౌదరి కేవలం 27 బంతుల్లో 54 పరుగులు చేసి అసాధ్యమైన విజయాన్ని అందించడంతో లక్నో జట్టు ఫుల్ జోష్‌లో ఉంది.

హెడ్-టు-హెడ్ రికార్డులు:

ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య (LSG vs GT) జరిగిన పోరులో గుజరాత్ టైటాన్స్ స్వల్ప ఆధిక్యాన్ని కలిగి ఉంది. ఇరు జట్లు తలపడిన 7 మ్యాచ్‌ల్లో గుజరాత్ 4 సార్లు విజయం సాధించగా, లక్నో 3 మ్యాచ్‌ల్లో గెలిచింది. 2022లో ప్రారంభమైన వీరి వైరి చరిత్రలో మరో ఆసక్తికర పోరు నేడు జరగనుంది.

ఎవరి బలం ఎంత..

ఈ మ్యాచ్‌లో గుజరాత్ బ్యాటర్ జోస్ బట్లర్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో ఫామ్ కోల్పోయిన బట్లర్, ఈ సీజన్‌లో తన పాత జోరును ప్రదర్శిస్తూ ఇప్పటికే కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. నేడు లక్నో బౌలర్లను ఆయన దీటుగా ఎదుర్కొంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు లక్నో బౌలింగ్ విభాగంలో ప్రిన్స్ యాదవ్ ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో అతను పొదుపుగా బౌలింగ్ చేసి వికెట్లు తీయడం వల్లే ప్రత్యర్థి జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది.

లక్నో సూపర్ జాయింట్స్:

రిషబ్ పంత్ (కెప్టెన్/వికెట్ కీపర్), ఎయిడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, ముకుల్ చౌదరి, షాబాజ్ అహ్మద్, మహమ్మద్ షమీ, మణిమారన్ సిద్ధార్థ్, ఆవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్. (ఇంపాక్ట్ ప్లేయర్: దిగ్వేష్ సింగ్ రాఠీ)

గుజరాత్ టైటాన్స్:

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబడా, మహమ్మద్ సిరాజ్, ప్రసీద్ కృష్ణ. (ఇంపాక్ట్ ప్లేయర్: అశోక్ శర్మ)

ప్రస్తుత గణాంకాలు, గత మ్యాచ్‌ల ఫలితాలను బట్టి చూస్తే ఇరు జట్లు సమతూకంతో ఉన్నాయి. మైదానంలో ఆటగాళ్ల ప్రదర్శన, వ్యూహాలే ఈ మ్యాచ్ (LSG vs GT) విజేతను నిర్ణయించనున్నాయి.

Read Also: నో కాంప్రమైజ్.. ఇదే జెన్ జీ ఫార్ములా!!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>