తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy).. ఎన్నికల కోడ్‌ను ఉల్లంగించారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్(Gangula Kamalakar) వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ అమలులో ఉందని, కానీ రేవంత్ ఇక్కడ ఒక సభ పెట్టి సినీ కార్మికులకు హామీలు ఇచ్చారని, ఇది పూర్తిగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అని ఆయన అన్నారు. ‘‘యూసఫ్ గూడలో రేవంత్ రెడ్డి సినీ కార్మికుల సభ పెట్టి ఎన్నికల కోడ్ ఉల్లంఘించాడు.
ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఎలాంటి హామీలు ఇవ్వకూడదని తెలిసి కూడా హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టాలని బీఆర్ఎస్(BRS) పార్టీ డిమాండ్ చేస్తుంది. సినిమాలు చూపించే సినీ కార్మికులకు అబద్ధాలు చెప్పి రేవంత్ రెడ్డి సినిమా చూపించాడు. సినిమా షూటింగ్లు ఆపి మరీ బలవంతంగా మెడ మీద కత్తి పెట్టి సభకు తీసుకు వెళ్ళాడు. వాళ్ళు కూడా అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసినట్లు మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారని భయంతో బిక్కు బిక్కుమంటూ సభకు వెళ్లారు’’ అని గంగుల(Gangula Kamalakar) అన్నారు.
Read Also: ట్రంప్‌కు దక్షిణ కొరియా అరుదైన గౌరవ

