అమెరికా చరిత్రలో ఏ అధ్యక్షుడికీ లభించని అరుదైన గౌరవం ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump)కు దక్కింది. దక్షిణ కొరియా ప్రభుత్వం తమ దేశ అత్యున్న అవార్డుతో ట్రంప్‌ను గౌరవించింది. తమ దేశ అత్యున్న అవార్డు గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ముగుంగ్వా, చియోన్మాచాంగ్ నకలు బంగారు కిరీటాన్ని ప్రదానం చేసింది. ప్రస్తుతం ట్రంప్.. దక్షిణకొరియా(South Korea)లోనే ఉన్నారు. ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార శిఖరాగ్ర(APEC Summit) సదస్సులో పాల్గొనడం కోసం ట్రంప్.. అక్కడకు వెళ్లారు. ఇందులో భాగంగానే ఆయన బుధవారం గ్యోంగ్జు నేషనల్ మ్యూజియంను సందర్భించారు. ఆ సమయంలోనే ట్రంప్‌కు దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జేమ్యుంగ్.. బంగారు కిరీటం నకలును బహూకరించారు. దీంతో దక్షిణా కొరియా నుంచి ఈ గౌరవం పొందిన తొలి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచారు.
Read Also: పిల్లల కోసం రెడీ అవుతున్నా: రష్మిక

