ప్రతి ఇంటికి ఫ్రీ ఫ్రిజ్, పురుషులకు ఫ్రీ జర్నీ.. సంచలన మేనిఫెస్టో

కలం, వెబ్ డెస్క్: తమిళనాడులో ఎన్నికల (Tamil Nadu Elections) కోలాహలం నెలకొంది. వచ్చే నెల 23న తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. దీంతో ఓట్లర్లను ఆకర్షించేలా ప్రధాన పార్టీలు హామీలను గుప్పిస్తున్నాయి. తాజాగా, ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే తన ఎన్నికల మేనిఫెస్టోను మంగళవారం ప్రకటించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళణిస్వామి తాజా మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. తాము అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి ఉచితంగా రిఫ్రిజిరేటర్, మహిళలకు అమ్మ టూవీలర్ పథకం కింద స్కూటీ కోసం రూ.25 వేలు సబ్సిడీ అందిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది.

అలాగే మహిళలతో పాటు పురుషులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని వెల్లడించింది. రేషన్ లో ఉచితంగా కేజీ నూనె, కందిపప్పు, లీటర్ వంట నూనె కూడా అందిస్తామని ఎన్నికల తాయిళాలు ప్రకటించింది. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి నెలకు రూ. 2,000 నేరుగా ఖతాలకు బదిలీ చేస్తామని తెలిపింది. పేదలకు అమ్మ ఇల్లు మంజూరు చేయనున్నట్లు వివరించింది. కాగా, ఈసారి తమిళనాడు రాజకీయాల్లో అన్ని పార్టీలు ఉచిత పథకాలను ప్రకటిస్తున్నాయి. తొలిసారి ఎన్నికల్లో పోటీచేస్తున్న నటుడు విజయ్ పార్టీ టీవీకే కూడా ఉచిత హామీల్లో పోటీ పడుతుంది. దీంతో తమిళనాడు ఎన్నికల్లో (Tamil Nadu Elections) కొత్త కొత్త పథకాలు, హమీలు పుట్టుకొస్తున్నాయి.

తమిళనాడులో ఉచిత పథకాల ప్రస్తావన గతం నుంచే ఉంది. 1967 నుంచి ప్రభుత్వాలను ఏర్పాటుచేస్తున్న డీఎంకే, అన్నాడీఎంకేలు.. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఉచితాల ప్రకటనలో పోటీపడ్డాయి. 1978లో నాటి దివంగత సీఎం ఎంజీఆర్ (MGR) మధ్యాహ్న భోజనం, రేషన్ బియ్యం పథకాన్ని మొదలుపెట్టగా.. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత 2006లో డీఎంకే ఉచిత కలర్ టీవీలు, 2011లో జయలలిత ఉచిత మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు ప్రకటించారు. మరి, ప్రస్తుతం తమిళనాడు జనం ఎవరిని నమ్మి గద్దెనెక్కిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Read Also: అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం.. సరదాగా ముచ్చటించుకున్న ఆ ముగ్గురు

Follow Us On: X(Twitter)

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>