దివ్యాంగుల సమస్యలపై పోరాడుతాం: KTR

కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులను మోసం చేసిందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన రూ.6,000 పెన్షన్ హామీని కాంగ్రెస్ నెరవేర్చలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమను మోసం చేసిందని కేటీఆర్ కు దివ్యాంగులు వినతిపత్రం అందజేసిన వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రేపు (మార్చి 25) ఇందిరా పార్క్ వద్ద దివ్యాంగుల నిరసన దీక్ష చేపడుతున్నట్లు వారు కేటీఆర్ కు వివరించారు. దీంతో దివ్యాంగుల సమస్యలపై పోరాడతామన్న కేటీఆర్.. రేపు దివ్యాంగులు చేపట్టే నిరసన దీక్షకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందన్నారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని విమర్శించారు. దివ్యాంగులు కూడా రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారని మండిపడ్డారు. దివ్యాంగులకు ఎన్నికలకు ముందు ఏదైతే హామీలు ఇచ్చారో.. ఆ హామీలను ప్రభుత్వం నెరవేర్చాలన్నారు. ఎన్నికలకు ముందు దివ్యాంగులకు రూ. 6,000 పెన్షన్ ఇస్తానని చెప్పి .. ప్రభుత్వం ఏర్పాటు తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ మాట తప్పిందని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో దివ్యాంగుల సంక్షేమ కోసం ఎంతో కృషి చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దివ్యాంగుల సంక్షేమం గంగలో కలిసిపోయిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు వల్ల దివ్యాంగులు నానా ఇబ్బందులు పడుతున్నారని.. నెల నెలా వచ్చే పెన్షన్ కూడా సరైన సమయానికి దివ్యాంగులకు అందడం లేదని చెప్పారు. శాసనసభలో దివ్యాంగుల సమస్యలపై ప్రస్తావిస్తామని వెల్లడించారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>