క్షుద్రపూజల వివాదం.. రేవంత్‌ కి కేటీఆర్ కౌంటర్

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం క్షుద్ర పూజల వివాదం అగ్గి రాజేసింది. హరీశ్ రావు క్షుద్ర పూజలు చేసి రాష్ట్రానికి, కాంగ్రెస్ పార్టీకి నష్టం చేయాలని చూశారని కాంగ్రెస్ కీలక నేతలు చేసిన ఆరోపణలపై కేటీఆర్ (KTR) మీడియా చిట్ చాట్ లో స్పందించారు. క్షుద్ర పూజలు అంటూ క్షుద్రరాజకీయాలకు మొదలు పెట్టారని కాంగ్రెస్ పార్టీ నేతలపై ఆయన ధ్వజమెత్తారు.

తమకు క్షుద్ర రాజకీయాలు తెలియదు.. స్ట్రైయిట్ పాలిటిక్స్ మాత్రమే తెలుసన్నారు. హరీశ్ రావు గుడికి వెళ్లి పూజలు చేయడం తప్పా? అని కేటీఆర్ ప్రశ్నించారు. క్షుద్రరాజకీయాలు పక్కనపెట్టి పరిపాలనపై దృష్టి సారించాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టిలో భూమి అంటే కేవలం రియల్ ఎస్టేట్ మాత్రమేనని ఆయన (KTR) విమర్శించారు. తాము కర్రతో పొడిస్తేగాని పంపులు ఆన్ చేయలేదని.. సీఎం కి ఎప్పుడు నీళ్లు ఎత్తిపోయాలో కూడా తెలియదని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

జీఆర్ఎంజీ ఎజెండాలో 7 వివాదాస్పద అంశాలు పెట్టారని హరీశ్ రావు ప్రశ్నించినా.. తెలంగాణ ప్రభుత్వం స్పందించలేదని ఆయన ఆరోపించారు. తాము కాంగ్రెస్ లా మేడిగడ్డ బ్యారేజ్ ను బాంబులు పెట్టి పేల్చి కూల్చి ఓట్లు దండుకోవాలని చూడలేదని తీవ్ర విమర్శలు చేశారు. పోతిరెడ్డి పాడు ద్వారా ఏపీ నీటిని తరలించుకుపోతున్నా సీఎం రేవంత్ రెడ్డికి సోయి లేదని కేటీఆర్ ఆరోపించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>