Mobile Popup Ad
Mobile Popup Ad

ఆ జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు.. ఉలికిపడ్డ గ్రామం

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలోని బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలో దొంగలు పడ్డారు. సోమవారం అర్ధరాత్రి ఓ రెండు ఇండ్లలో దొంగలు చోరికి (Robbery) పాల్పడడంతో స్థానికులు భయ బ్రాంతులకు గురయ్యారు. ఒకేసారి రెండు చోరీలు జరగడంతో ఆందోళన వ్యక్తం చేశారు. పాత సారపాకకు చెందిన పుట్టి రాజు కుటుంబ సభ్యులతో ఊరెళ్లాడు. విషయం గమనించిన దొంగలు ఇంట్లోకి ప్రవేశించి బీరువా తాళాలు పగలగొట్టి నగదు, బంగారు ఆభరణాలు దొంగిలించారు. అలాగే పొట్రూ అనిల్ ఇంట్లో తెల్లవారుజామున పార్క్ చేసి ఉంచిన బైక్‌ను అపహరించారు. ఈ ఘటనలతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు మంగళవారం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>