కలం వెబ్ డెస్క్ : మహారాష్ట్ర(Maharashtra)లోని సోండో(Sondo) ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం( Road Accident) సంభవించింది. ఓ కారు బ్రిడ్జి పై నుంచి బోల్తా పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో గాయపడ్డ మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా తెలంగాణకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌కు చెందిన ఓ కుటుంబం కారులో వైద్యం నిమిత్తం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు వెళ్తున్నారు. ఈ క్రమంలో సోండో ప్రాంతానికి చేరుకున్న తర్వాత కారు అదుపు తప్పి బ్రిడ్జ్ పై నుంచి కింద పడింది. దీంతో ముగ్గురు మహిళలు, ఓ బాలిక అక్కడికక్కడే మృతి చెందారు. స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ ఇద్దరిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Read Also: ఎన్‌కౌంటర్ మృతుల్లో ‘మావోయిస్టు’ అగ్రనేత
Follow Us On: X(Twitter)


