కలం, వెబ్ డెస్క్: మావోయిస్టులకు (Maoists) వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కేంద్ర బలగాలు విస్త్రృత గాలింపు చర్యలు చేపడుతుండటంతో మావోయిస్టులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. భారీగా సరెండర్లు అవుతున్నా.. కేంద్ర బలగాలు ఎన్‌కౌంటర్ (Encounter), కూంబింగ్ చర్యలను వేగవంతంగా చేస్తున్నాయి. దీంతో దండకారుణ్యంలో మరోసారి తూట పేలింది. గుమ్మా అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారకు. ఒక రివాల్వర్, ఒక 303 రైఫిల్, వాకీటాకీ స్వాధీనం చేసుకున్నాయి. మృతులు ఇద్దరిపై రూ.23.65 లక్షల రివార్డు ఉంది.
మృతుల్లో ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాకు చెందిన రాకేష్ ఉన్నాడు. ఈయన బంసధార-ఘుమ్‌సర్-నాగవళి డివిజన్‌కు చెందిన ఏరియా కమిటీ సభ్యుడు. మరో సభ్యుడు అమృత్ ఉన్నాడు. మావోయిస్టు కార్యకలాపాలలో పాల్గొన్నందుకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర సంస్థలు రూ.23.65 లక్షల రివార్డును ప్రకటించాయి. ఎన్ కౌంటర్ ఘటనలో భద్రతా దళాలకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ఒడిశాలోని (Odisha) గిరిజన ప్రాబల్యం ఉన్న జిల్లాల్లో వామపక్ష తీవ్రవాదాన్ని అరికట్టడానికి జరుగుతున్న ప్రయత్నాలో భాగంగా ఈ ఎన్‌కౌంటర్ (Encounter) జరిగింది. పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్ నుంచి మావోయిస్టు గ్రూపులు తరచుగా తిరుగాడుతున్నాయి. దీంతో కేంద్ర బలగాలు ప్రత్యేక నిఘా పెట్టాయి.
Read Also: టెండుల్కర్ మరో రికార్డ్ బ్రేక్ చేసిన కోహ్లీ
Follow Us On: Instagram


