కలం మెదక్ బ్యూరో: సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో (KCR) మాజీ మంత్రి జీవన్ రెడ్డి భేటీ అయ్యారు. నిన్న కేటీఆర్ జగిత్యాలకు వెళ్లి జీవన్ రెడ్డిని (Jeevan Reddy) బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించిన నేపథ్యంలో కేసీఆర్‌ను శుక్రవారం కలిశారు. కేసీఆర్‌తో లంచ్ మీటింగ్ తర్వాత BRSలో చేరిక తేదీని ప్రకటించే అవకాశం ఉంది. ఈ భేటీలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ నేతలు రమణ, డాక్టర్ సంజయ్ కూడా ఉన్నారు. ప్రస్తుత భేటీకి రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
Read Also: డ్రంక్ అండ్ డ్రైవ్.. ఇకపై బండి సీజ్ చేయడం కుదరదు!
Follow Us On: Sharechat

