వేములవాడ రోడ్డు ప్రమాదం.. మరో ఇద్దరు మృతి!

కలం, కరీంనగర్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ (Vemulawada) అర్బన్ మండలం అనుపురం వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగిన విషయం తెలిసిందే. ఒక టాటా ఏస్ వాహనాన్ని బస్సు బలంగా ఢీకొట్టిన ఘటనలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అర్చన, ప్రభాకర్ అనే ఇద్దరిని చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

అయితే అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో వారు శుక్రవారం ఉదయం కన్నుమూశారు. దీంతో ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య మొత్తం ముగ్గురికి చేరింది. కాగా ఈ ఘటనలో గాయపడిన మిగతా క్షతగాత్రులు ప్రస్తుతం వేములవాడ, సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద తీవ్రతకు టాటా ఏస్ వాహనం పూర్తిగా బోల్తా పడింది.​ ఈ ఘోర ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధితుల కుటుంబాలలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>