Mobile Popup Ad
Mobile Popup Ad

ఆ కార్పొరేట‌ర్ల‌ ఎన్నిక రద్దు చేయండి… కొత్త‌గూడెంలో పిటిషన్లు!

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం (Kothagudem) మున్సిపల్ కార్పొరేషన్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన ఇద్దరు కార్పొరేటర్ల (Corporators)ను అనర్హులుగా ప్రకటించాలని కొత్తగూడెం జిల్లా కోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. 47వ డివిజన్, 54వ డివిజన్‌ల‌లో గెలిచిన అభ్యర్ధుల ఎన్నికల అఫిడవిట్‌లో తప్పులు ఉన్నాయంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. 47వ డివిజన్ నుంచి సీపీఐ (CPI) పార్టీ తరఫున‌ గెలుపొందిన గుర్రం వెంకటేశ్వర్లుపై బీఆర్ఎస్ (BRS) అభ్యర్థి మిరియాల అలివేలు పిటిషన్ దాఖలు చేశారు.

54వ డివిజన్ నుంచి కాంగ్రెస్ (Congress) పార్టీ తరుఫున‌ విజయం సాధించిన జయంతి మసూద్‌పై బీఆర్ఎస్ అభ్యర్థి మాదాసు పద్మ పిటిషన్ దాఖలు చేశారు. రెండు కేసుల్లో పిటిషనర్ల తరఫున‌ న్యాయవాదులుగా ఎండీ సాదిక్ పాషా, డి.సామంత్, సంకుభాపన అనుదీప్ పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. వాదనలు విన్న జిల్లా కోర్టు పిటిషన్లు స్వీకరించి, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మే 6వ తేదీకి వాయిదా వేసింది.

Read Also: రాజ్యసభ సభ్యుడిగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>