నాకు తెలంగాణ ఫస్ట్​.. తరువాతే పార్టీ : ఈటల కీలక వ్యాఖ్యలు

కలం, వెబ్​ డెస్క్​ : నాకు తెలంగాణ రాష్ట్రమే మొదటి ప్రాధాన్యత.. తరువాత పార్టీ.. ఆ తరువాతే వ్యక్తిగత విషయాలు అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender)​ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్ లో ఈటల మీడియాతో మాట్లాడారు.

కాళేశ్వరం కంటే ముందు వైఎస్​ఆర్ రాజశేఖర్​ రెడ్డి జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టులు నిర్మించారని గుర్తు చేశారు. జల యజ్ఙంలో భాగంగానే తమ్మిడిహట్టి ప్రాజెక్ట్​ రూపకల్పన చేశారన్నారు. కాళేశ్వరం నీళ్లు చేవెళ్ల వరకు రావాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచించిందని తెలిపారు. తాను ఎవరో పలికిస్తే మాట్లాడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు.

తన మాటలు వ్యవసాయం గురించి అవగాహన ఉన్నవారికి అర్థమవుతాయని ఈటల రాజేందర్ వెల్లడించారు. ఎల్​ నినో హెచ్చరికలు.. తెలంగాణలో వర్షాభావ పరిస్థితలు ఉన్నాయన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్​ ప్రభుత్వం నిపుణులు, ఇంజినీర్స్ తో ఒక మీటింగ్​ పెట్టి లక్ష్మీబరాజ్, అన్నారం, సుందిళ్ల బరాజ్​ లో నీటి ఎత్తిపోతలపై ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదు అని ఈటల నిలదీశారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>