కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో డ్రంక్ అండ్ డ్రైవ్ (Drunk and Drive) తనిఖీల సమయంలో వాహనాల సీజింగ్‌పై హైకోర్టు (Telangana High Court) మరోసారి స్పష్టతనిచ్చింది. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన సందర్భాల్లో సదరు వాహనాన్ని సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు పోలీస్ శాఖకు కీలక సూచనలు జారీ చేసింది.
తనిఖీల్లో ఎవరైనా పరిమితికి మించి మద్యం సేవించి దొరికినప్పుడు, ఆ వాహనంలో మద్యం సేవించని వారు ఎవరైనా ఉంటే వారికి వాహనాన్ని అప్పగించాలని కోర్టు తెలిపింది. ఒకవేళ వాహనంలో మద్యం సేవించని వారు (Drunk and Drive) ఎవరూ లేని పక్షంలో, సదరు వాహనాన్ని నేరుగా పోలీస్ స్టేషన్‌కు తరలించకూడదని పేర్కొంది. అటువంటి పరిస్థితుల్లో వాహనదారుడి స్నేహితులు లేదా బంధువులకు సమాచారం అందించి, వారు వచ్చిన తర్వాత వాహనాన్ని వారికి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు తన ఆదేశాల్లో వెల్లడించింది.
Read Also: ఓరుగల్లు రాణి రుద్రమలు: కార్పొరేషన్ నుంచి క్యాబినెట్ వరకు మహిళలదే హవా!
Follow Us On: Facebook

