Mobile Popup Ad
Mobile Popup Ad

టీఆర్ఎస్‌లోకి మాజీ మంత్రి

కలం, వెబ్ డెస్క్ : కల్వకుంట్ల కవిత పార్టీ టీఆర్ఎస్ (TRS Party) లోకి చేరికలు మొదలయ్యాయి. మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు బోడ జనార్దన్ టీఆర్ఎస్ లో చేరనున్నారు. శుక్రవారం బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ చీఫ్ కవితను మర్యాదపూర్వకంగా కలిసి జనార్దన్ భేటీ అయ్యారు. గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన ఆయన ప్రస్తుత మంచిర్యాల నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. కవితను కలిసిన సందర్భంగా తాను త్వరలో తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్ లో చేరుతానని ప్రకటించారు. సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలో తెలంగాణ రక్షణ సేనను బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ఆయన వెల్లడించారు. కాగా, బోడ జనార్దన్ చేరికతో కవిత టీఆర్ఎస్ పార్టీకి బలం చేకూరే అవకాశం ఉంది.

Read Also: తెలంగాణ ACB డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన అవినాష్ మహంతి

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>