కలం, వెబ్ డెస్క్ : తిరుమలలో (Tirumala) భక్తుల కోసం చెప్పుల కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు ఆలయ ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. ఈ చెప్పుల కౌంటర్లు లగేజీ కౌంటర్ల మాదిరిగానే ఉంటాయన్నారు. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద బిల్డింగ్ వద్దనే ఈ చెప్పుల కౌంటర్లు ఏర్పాటు చేశామని ఈవో వెంకయ్య చెప్పారు. తిరుమలలో భక్తులు చెప్పులను భద్రపరుచుకోడానికి పడుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టడానికి వీటిని తీసుకొచ్చామన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 దగ్గర ఏర్పాటు చేసిన పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ కావడంతో వీటిని స్టార్ట్ చేసినట్టు ఈవో వెంకయ్య వివరించారు.
భక్తులు చెప్పులను భద్రపరుచుకున్నప్పుడు క్యూ ఆర్ కోడ్ ఉన్న స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ క్యూ ఆర్ కోడ్ లో సీరియల్ నెంబర్, చెప్పుల సైజు, ర్యాక్ నెంబర్ లాంటివి ఉంటాయి. దర్శనం తర్వాత భక్తులు ఆ స్లిప్ ను సిబ్బందికి ఇస్తే.. వాళ్లు కోడ్ ను స్కాన్ చేసి చెప్పులు ఏ ర్యాక్ లో ఉన్నాయో ఈజీగా గుర్తించి భక్తులకు అప్పగిస్తారు. దీని వల్ల ఎవరి చెప్పులు వారే పొందే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

Read Also: రూ.126 కోట్ల పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
Follow Us On: Pinterest


