కలం, వెబ్ డెస్క్ : తిరుమల, తిరుపతి, చంద్రగిరి ప్రజల తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) అన్నారు. అందులో భాగంగానే భారీగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నట్టు తెలిపారు. మంగళవారం రూ.126 కోట్లతో కృష్ణా జలాలను నీవా బ్రాంచ్ కెనాల్ నుంచి కల్యాణి డ్యామ్ కు తరలించే పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపనలు చేశారు. ఈ ప్రాజెక్టుతో తిరుపతి చుట్టు పక్కల ప్రాంతాల ప్రజల నీటి అవసరాలు పూర్తిగా తీరుతాయన్నారు సీఎం చంద్రబాబు. తిరుమలకు వచ్చే భక్తులకు కూడా ఈ నీరు ఉపయోగపడుతుందని తెలిపారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా సీఎం చంద్రబాబు నారావారి పల్లెలో (Naravari Palle) పర్యటించారు. గ్రామంలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్, బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, ఇండోర్ సబ్ స్టేషన్లను ప్రారంభించారు. తాను అనుకున్న స్వర్ణ నారావారి పల్లె కోసం ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతానని సీఎం చంద్రబాబు గ్రామస్తులతో చెప్పారు. రాయలసీమతో పాటు రాష్ట్రానికి భవిష్యత్ లో కావాల్సిన వాటిని దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని.. అభివృద్ధితో పాటు మౌళిక సదుపాయాల్లో రాయలసీమను ముందుకు తీసుకెళ్తామన్నారు సీఎం చంద్రబాబు (Chandrababu).
Read Also: అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు : మంత్రి రాంప్రసాద్ రెడ్డి
Follow Us On: Sharechat


