కలం, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో ఉన్న ప్రముఖ షాపింగ్ మాల్ అయిన ‘లులు మాల్’లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. లులు హైపర్‌మార్కెట్ (Lulu Mall)లో కొనుగోలు చేసిన మిక్చర్ ప్యాకెట్‌లో చనిపోయిన బల్లి (ఫ్రై అయిన బల్లి) వచ్చిన ఘటన ఇటీవల సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపింది.
ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు చేపట్టారు. మాల్‌లోని వంటగది (Kitchen) విభాగంలో తనిఖీలు జరిపి అపరిశుభ్రత, పాడైపోయిన కూరగాయలను గుర్తించారు. అంతే కాకుండా గడువు పూర్తయిన ఆహార పదార్థాలపై కొత్త లేబుళ్లు వేసి మార్చి అమ్మడాన్ని గుర్తించారు. మాల్‌లో (Lulu Mall) నిల్వ ఉంచిన శనగపిండి, గోధుమ పిండి, పప్పుల్లో పురుగులు ఉండడాన్ని గుర్తించారు. నాణ్యత లేని 150 కిలలో ఆహార పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు అధికారులు.
Read Also: దేశంలో ఆర్థిక తుఫాన్ రాబోతోంది.. మోదీ విధానాలపై రాహుల్ గాంధీ ఫైర్!
Follow Us On: WhatsApp

