Mobile Popup Ad
Mobile Popup Ad

దేశంలో ఆర్థిక తుఫాన్ రాబోతోంది.. మోదీపై రాహుల్ గాంధీ ఫైర్!

కలం, వెబ్ డెస్క్: పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో ‘ఆర్థిక తుఫాన్’ రాబోతోందని, దీనివల్ల సాధారణ ప్రజలు తీవ్రమైన ఆర్థిక భారాలు, ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూపొందించిన ఆర్థిక నిర్మాణం త్వరలోనే కూలిపోనుందన్నారు. ఫలితంగా నిత్యావసరాల ధరలు పెరిగి మధ్యతరగతి, పేద కుటుంబాలపై కోలుకోలేని దెబ్బ పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రభుత్వం ప్రజల నుంచి ‘వసూళ్లు’ ప్రారంభించిందని, ఈ ధరల పెరుగుదల కేవలం ప్రారంభం మాత్రమేనని విమర్శించారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల హెచ్చుతగ్గులు, పశ్చిమ ఆసియా సంక్షోభాన్ని సాకుగా చూపుతూ కేంద్రం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటోందని ఆరోపించారు.

మోదీ (Modi) విధానాలను కాంగ్రెస్‌తోపాటు ఇతర పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాలు, దూరదృష్టి లేకపోవడం, అసమర్థత వల్లే దేశం నేడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని పేర్కొన్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సాధారణ ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>