కలం, వరంగల్ బ్యూరో : సర్పంచ్ ఎన్నిక ఓ కుటుంబంలో విషాదం నింపింది. మద్యం మత్తులో జరిగిన గొడవలో కొడుకు దాడి చేయగా తండ్రి చనిపోయాడు. ఈ ఘటన మహబూబాబాద్(Mahabubabad) జిల్లా గూడూరు మండలందామరవంచ శివారు హట్య తండాలో జరిగింది. గూడూరు ఎస్సై గిరిధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన ధరావత్ నందిరాం కుటుంబంతో సహా హైదరాబాద్ లో పనిచేసుకుంటూ జీవిస్తున్నాడు. సర్పంచ్ ఎన్నికల కోసం కుటుంబం మొత్తం తండాకు వచ్చింది. నందిరాం ఎన్నికల ప్రచారంలో మద్యం తాగి ఇంటి కొచ్చి గొడవ చేశాడు. వద్దని భార్య వారించినా వినలేదు. భార్య, కొడుకు కృష్ణను రోకలితో కొట్టడానికి ప్రయత్నించాడు. కృష్ణ అడ్డుపడగా ఘర్షణ జరిగింది. అదే రోకలితో కృష్ణ తండ్రి ఛాతిపై కొట్టడం వల్ల స్పృహ తప్పి పడిపోయాడు. నందిరాంను హాస్పిటల్ కు తరలించేలోపే చనిపోయాడని పోలీసులు తెలిపారు.
Read Also: 100 రోజుల ఉపాధి హామీ ఉత్తదేనా?
Follow Us On: X(Twitter)


