కలం డెస్క్: Duvvada Srinivas Farmhouse Party | రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఓ ఫామ్ హౌస్‌లో నిర్వహించిన బర్త్ డే పార్టీని పోలీసులు భగ్నం చేశారు. అక్కడ భారీగా విదేశీ మద్యం, హుక్కా బాటిళ్లు దొరికినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ శివారులోని ఓ ప్రైవేట్ ఫార్మ్‌హౌస్‌లో ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో ఎటువంటి పర్మిషన్ లేకుండా అక్కడ పార్టీ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం 10 విదేశీ స్కాచ్ బాటిళ్లు, 5 హుక్కా బాటిళ్లను ఎస్ వోటీ పోలీసులు సీజ్ చేసినట్టు సమాచారం.
ఈ ఇష్యూలో ఈ దంపతులు దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas), మాధురి ఉన్నట్లు వార్తలొచ్చాయి. దీంతో ఫామ్ హౌస్ పార్టీపై దువ్వాడ క్లారిటీ ఇచ్చారు. పార్థు అనే స్నేహితుడి పార్టీకి పిలిస్తే వెళ్లామని, అక్కడ బిజినెస్ ఎక్స్‌పన్షాన్ గురించి మాత్రమే పార్టీ జరిగిందని వివరించారు. తాను మందు కూడా తాగనని, మద్యం సేవించే అలవాటు తనకు లేదని క్లారిటీ ఇచ్చారు. కేవలం బిజినెస్ వ్యవహారాల కోసమే అక్కడికి వెళ్లానన్నారు. మాధురి పుట్టినరోజు సందర్భంగా పార్టీ చేసుకున్నట్లు వచ్చే వార్తలో ఎలాంటి నిజం లేదని దువ్వాడ తేల్చి చెప్పారు.
Read Also: సర్పంచ్ ఎన్నిక ఎఫెక్ట్.. కొడుకు దాడిలో తండ్రి మృతి
Follow Us On: Youtube


