కలం, ఖమ్మం బ్యూరో: రెండో విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు (second phase panchayat elections) సర్వం సిద్ధం చేసినట్టు ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కామేపల్లి, ఖమ్మం రూరల్, కూసుమంచి, ముదిగొండ, నేలకొండపల్లి, తిరుమలాయ పాలెం మండలాల పరిధిలో ఉన్న 183 గ్రామ పంచాయతీలు, 1686 వార్డులకు రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసి నామినేషన్లు స్వీకరించామన్నారు.
ఒక వార్డుకు నామినేషన్ దాఖలు కాలేదని, 23 గ్రామ పంచాయతీలు, 306 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయని తెలిపారు. మిగిలిన 160 గ్రామ పంచాయతీలకు మొత్తం 451 మంది, 1379 వార్డులకు మొత్తం 3352 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారన్నారు. ఈ నెల 14న ఆదివారం రెండో విడత ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణకు 2023 బ్యాలెట్ బాక్సులు, 1831 పోలింగ్ అధికారులు, 2346 మంది ఏపిఓ లను సిద్ధం చేశామని అన్నారు.
రెండో విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు (second phase panchayat elections) 28 లొకేషన్స్‌లో 304 క్రిటికల్ కేంద్రాలు ఉన్నాయని, అక్కడ సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. పటిష్ట బందోబస్తు చేపట్టామన్నారు. రెండో విడత పంచాయతీ ఎన్నికలలో మొత్తం 2 లక్షల 51 వేల 327 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకొనున్నట్టు తెలిపారు. ఇందులో లక్షా 21 వేల 164 మంది పురుషులు, లక్షా 30 వేల 156 మంది మహిళలు, ఏడుగురు ఇతర ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్‌కు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని అన్నారు. ఓటుహక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కును స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా వినియోగించుకొని ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Read Also: ‘టైమ్స్’ కవర్‌పేజీగా కృత్రిమ మేధ నిర్మాతలు
Follow Us On: Instagram


