కలం, మెదక్ బ్యూరో : సెంట్రల్ ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీగా సంగారెడ్డి జిల్లా ఫసల్‌వాది (Fasalwadi) గ్రామ పంచాయతీ నిలిచింది. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ “ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ” విభాగంలో ప్రకటించిన జాతీయ అవార్డును ఢిల్లీలో కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రి రంజన్ సింగ్ చేతుల మీదుగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అందుకున్నారు. మహిళా సాధికారత, భద్రత, అరోగ్య, సంక్షేమ కార్యక్రమాల అమలులో ఈ పంచాయతీ విశేషమైన కృషికి చేసినందుకు 2025 సంవత్సరానికి సంబంధించి ఈ ప్రతిష్టాత్మక అవార్డును ఫసల్ వాది గ్రామం దక్కించుకుంది.
కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు (DDUPSVP) భాగంగా తెలంగాణ రాష్ట్రం నుండి ఫలస్‌వాది పంచాయతీ ఈ ఘనతను సాధించింది. తమ గ్రామానికి జాతీయ స్థాయి అవార్డు రావడం పట్ల గ్రామ ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన కెటగిరిలో దేశంలోనే ఫసల్ వాది గ్రామ పంచాయతీకి ఇచ్చే జాతీయ అవార్డు సాధించడం గర్వంగా ఉందని చెబుతున్నారు.

